కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో ఆధిపత్యం చలాయించే అధికారం లేదని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య ప్రభుత్వ స్పూర్తిని కాపాడాలని సూచించింది.
ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని కేజ్రీవాల్ నిరసనకు దిగిన నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలే తప్ప పెత్తనం చలాయించే అధికారం లేదని మిశ్రా వెల్లడించారు. ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య విభేదాలు తలెత్తితే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.