జమ్మూకాశ్మీర్ సాంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాశ్మీరు లోని సాంబా ఘాట్ రోడ్డుపై వెళుతున్నఎస్.యు.వి వాహనం అదుపు తప్పి పక్కనే వున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.