ఓటర్ ఐడి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయలేదా?

సోమవారం, 16 మే 2022 (08:39 IST)
ఓటర్ ఐడి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయని వారికి గుడ్ న్యూస్. ఓటర్‌ ఐడికార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేయనుంది. ఓటర్లు స్వచ్చందంగా ఆధార్‌ వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. 
 
ఇలా అనుసంధానం చేయనివారు అందుకు కారణాలు చెప్పాల్సి ఉంటుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను లింక్ చేయడానికి అనుమతించడానికి కొన్ని నెలల క్రితం పార్లమెంటు ఆమోదించిన బిల్లులో భాగంగా నమోదు కోసం నాలుగు ప్రకటిస్తామన్నారు.
 
ఇక నుంచి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, అయితే సంవత్సరంలో నాలుగు సార్లు ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని సుశీల్ చంద్ర అన్నారు. 
 
ఇది వరకు ప్రతి సంవత్సరం జనవరి1న మాత్రమే ప్రజల తమ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఏడాదిలో నాలుగు తేదీలను ప్రకటిస్తామని, ఆ తేదీల్లో 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు