బీజేపీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఆమె పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తేరుకోలేని షాక్ ఇచ్చారు. త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తామంతా పార్టీని వీడుతున్నట్టు ఆరుగురు ఎమ్మెల్యేలు సంకేతాలు పంపించారు.
ఆ పార్టీ అభ్యర్థి రామ్‌జీ గౌతం నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారిలో అస్లం రైనీ, అస్లం చౌదరీ, ముజ్తబా సిద్దీఖీ, హకీం లాల్ బింద్ బుధవారం రిటర్నింగ్ అధికారిని కలిసి, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమతోపాటు రిటర్నింగ్ అధికారిని కలిశారని రైనీ అన్నారు.