సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్, ప్రైవేట్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు నీట్ పరీక్షను వాయిదా వేయాలని, కొత్త డేట్‌ను ప్రకటించాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు వారి వాదనలను తోసిపుచ్చింది.
సెప్టెంబర్ 12న షెడ్యూల్ ప్రకారం నీట్ పరీక్ష 2021 జరుగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పుడు కొందరు విద్యార్థుల కోసం దాన్ని వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.