తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించార. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఒంటరిగా 125 సీట్లలో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాల సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, స్టాలిన్ పూర్వీకులు తెలుగువారనే చర్చ ఇపుడు తెరపైకివచ్చింది.
ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3వ తేదీన జన్మించన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులది నిజానికి విజయనగరం జిల్లా. జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చిన కరుణ పూర్వీకులు ఇక్కడ పెళ్లూరు సంస్థానాన్ని పరిపాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో చేరారు
వీరి కుటుంబం నివసించడానికి చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించారు మహరాజావారు అంతేగాక వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు. ఆభూములను సాగుచేసుకుంటూ, దేవాస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా చాలాకాలం పనిచేశారు.
అయితే, కరువు కాటకాలు రావడం, పంటలు పండకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలను కరుణానిధే స్వయంగా చెప్పినట్లు వారు గుర్తుచేస్తున్నారు.