బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు..

ఠాగూర్

మంగళవారం, 18 మార్చి 2025 (09:08 IST)
తనను బంధించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై ఓ పులి దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వండి పెరియార్ అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల అటవీ ప్రాంతం నుంచి ఓ పులి జనావాస ప్రాంతాల్లోకి వచ్చినట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దానికి మత్తు మందు ఇవ్వడానికి 15 మిటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. 
 
దీంతో అది ఒక్కసారిగా వారిపై దాడి చేసేందుకు పైకి దూకింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అటవీశాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్ళు ఉంటుందని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు