పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసిపెట్టారు. ఈ నెల 14న వారి పెళ్లి జరిగింది. లాక్ డౌన్ కారణంగా వివాహానికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. ఇంకా రూ.37లక్షలు మిగిలింది. ఆ డబ్బుని వారు పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.
కొవిడ్ భయం కారణంగా చాలామంది ఆహ్వానితులు రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తామిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ చెప్పాడు. ఈ పరిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయకూడదని పెద్దలు నిర్ణయించారని, దీంతో తాము వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. స్థానిక అధికారుల అనుమతితో కొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినట్లు తెలిపాడు.