వాక్సిన్ వేసుకున్నా ఎందుకు మరణిస్తున్నారు !?

సోమవారం, 9 ఆగస్టు 2021 (09:05 IST)
కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది? వాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ వల్ల మనుషులు ఎందుకు మరణిస్తున్నారు? ఇది వాక్సిన్ వైఫల్యమా, మానవ తప్పిదమా?..
 
అసలు వాక్సిన్ ఏమిటి, అది ఏమి చేస్తుంది. కోవిడ్ వాక్సిన్ లో కరోనా అవశేషాలు ఉంటాయి. కవిడ్ యొక్క జినోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అ స్ట్రక్చర్ ద్వారా మన శరీరంలోని ఇమ్మ్యూనిటి అంటే తెల్ల రక్తకణాలకి కరోనా వైరస్ నించి రక్షించే వలయం ఏర్పాటుచేయ్యడం నేర్పిస్తుంది. తద్వారా మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం అంటే రక్షణ వలయం ఏర్పారుచుకుంటుంది.
 
అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ వాక్సిన్ మందు కాదు. కరోనాని ఆపేది వాక్సిన్ కాదు. రక్షణ వలయం ఏర్పాటు చేసేదీ వాక్సిన్ కాదు. అదీ కేవలం ఫార్ములా చూపిస్తుంది అంతే, మొత్తం చేసేది మన శరీరమే.
 
ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలంటే ముందు దాని స్ట్రక్చర్ గిస్తాము. ఇంజనీరు తన విధ్వత్తంతా ఉపయోగించి ప్లాన్ గిస్తాడు. అంత మాత్రాన ఇల్లు పుట్టుకురాదు. మంచి పనివాళ్ళు మంచి సిమెంటు మంచి ఇసుక మొదలైన వాటితో ఇల్లుని జాగ్రత్తగా అమర్చుకుంటూ వెళ్తేనే ఇల్లు తయారవుతుంది. ఇంజనీరు ఎంత మంచి ప్లాన్ వేసిన పని వాళ్ళు సరైన విధంగా కట్టకపోతే ఇల్లు కూలిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
 
వాక్సిన్ అనే కరోనా జినోమ్ స్ట్రక్చర్ మన ఒంట్లోకి వెళ్ళాక మన శరీరానికి రక్షణ వలయం అనే ఇల్లు కట్టడానికి 14 రోజులు పడుతుంది (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఆ 14 రోజులు పాటించాల్సిన నియమాలు పాటిస్తేనే మన శరీరం వాలయాన్ని క్రమంబద్దంగా పర్ఫెక్ట్ గా ఏర్పరుచుకుంటుంది. 
 
ఇందులో మొదటి నియమం perfect blood circulation, సరైన రక్తప్రసరణ. అంటే blood intoxication, acidic blood, blood hypertension, ఇవి లేకుండా చూసుకోవాలి. ఇదే అన్నిటికన్నా ముఖ్యం.
 
1. బైట అస్సలు తిరగకూడదు. ఎండ,  UV rays అస్సలు తగలకూడదు. UV rays కొంచెం తగిలిన anti bodies బాగా దెబ్బ తింటాయి.
 
2. జనాలుచేసే ఇంకో ముఖ్యమైన పొరపాటు. చిన్న పనే కదా అని బైటకి వెళితే. బైక్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా, పక్క బైక్ వాడు overtake చేసిన. ఏదన్నా వాహనం అదుపుతప్పి మీదకి రాబోయినా, రోడ్డు మీద ఎవరన్నా మనతో దురుసుగా ప్రవర్తించినా, వీటిల్లో ఏది జరిగిన మన రక్త ప్రసారణలో మార్పు వస్తుంది. Blood intoxication జరుగుతుంది. వెంటనే anti bodies దెబ్బ తింటాయి.
 
3. తరవాత మన work spot కి వెళతాం. అక్కడ మన కింద వాడితో పని విషయంలో గొడవ పైవాడితో వత్తిడి. మళ్ళీ BP ups and downs. మళ్ళీ తెల్ల రక్తకాణాలు దెబ్బ తింటాయి.
 
ఇప్పుడు గమనించండి బైటకి వెళ్ళగానే UV rays వల్ల దెబ్బ, రోడ్డు మీద hypertension వల్ల దెబ్బ, పని వేళలో వత్తిడి వల్ల దెబ్బ. ఇన్ని దెబ్బలతో మన శరీరం వలయాన్ని కట్టుకుంటుంది. ఇక వాక్సిన్ వేసుకున్నాం మాకేం కాదు అనే నిర్లక్ష్యం మనకే తెలియకుండా వస్తుంది.
 
సామజిక దూరం పాటించకుండా మాస్క్ శానిటైజర్ లేకుండా తిరిగేస్తారు. అదే సమయంలో కరోనా మన వంట్లోకి చేరుతుంది. వీక్ గా కట్టుకున్న వలయాన్ని కూలుస్తుంది, మన శరీరాన్ని ఆక్రమించుకుంటుంది.

ఈ సమయంలో గనుక మన ఇమ్మ్యూన్ సిస్టం పూర్తిగా చేతులెత్తేసిందంటే, ఇక ఎప్పటికి లేవదు. దాని కెపాసిటీ కోల్పోతుంది. సరైన తిండి పెట్టకుండా 10 యుద్ధలు చేయించిన సైనికుల్లా తయారవుతాయి మన తెల్ల రక్త కణాలు. ఇంక ఆ స్టేజిలో మనిషి మరణిస్తాడు.
 
అమెరికాలో వాక్సిన్ వేసిన తర్వాత 2 గంటలు హాస్పిటల్ లో కౌన్సిలింగ్ ఉంటుంది. అది అయ్యాక గాని బైటకి రారు. అది అక్కడ ప్రోటోకాల్. అందులో ఈ విషయాలన్నీ చెబుతారు. అందుకే వాళ్ళు post vaccine care బాగా తీసుకున్నారు. అందుకే అమెరికాలో వాక్సిన్ బాగా సక్సెస్ అయ్యింది.
 
మన దేశంలో అలాంటి కౌన్సిలింగ్లు లేవు. అందువల్లే అమెరికా కన్నా స్ట్రాంగ్ వాక్సిన్ అయిన మన వాక్సిన్స్ వేసుకుని కూడా కరోనా బారిన పడుతున్నారు.
 
దయచేసి అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడొచ్చిన వాక్సిన్ సంవత్సరాల క్రితం తయారుచేసింది కాదు. కొన్ని నెలల క్రితం మాత్రమే తయారుచేసింది. దీనికి ఇంకా medical history లేదు. ఇది ఇంకా primary దశ లో వేసిన వాక్సిన్. ఆల్ఫా స్టేజి అంటారు దాన్నే. ఇందులో వాక్సిన్ 20% చేస్తే 80% మన శరీరం చెయ్యాలి. అంటే మనమే చెయ్యాలి.
 
కొన్ని సంవత్సరాలలో ఇంకా స్ట్రాంగ్ వాక్సిన్లు వస్తాయి అప్పుడు వాక్సిన్ వెయ్యగానే తిరిగేయాగలుగుతాం. కానీ ఇప్పటికి మాత్రం ఆ స్టేజి లేదు.
 
దయచేసి వాక్సిన్ వేసుకున్న 14 రోజులు (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఇవి పాటించండి.
 
1. బైట తిరగవద్దు. ఎండలో అస్సలు తిరగవద్దు.
 
2. పాలు, పళ్ళు, dry fruits, కూరగాయలు, ఆకు కూరలు లాంటి మితమైన ఆహారం తినండి. బిర్యానీలు పిజ్జాలు బర్గర్ లు తినవద్దు. Digestion ఎప్పుడు తేలికగా ఉండేవి తినాలి.
 
3. మందు [లిక్కర్] తాగకూడదు, మందు వల్ల blood acidic అవుతుంది. దానివల్ల ఇమ్మ్యూనిటి వెంటనే డామేజ్ అవుతుంది.
 
4. డాక్టర్ సలహా లేకుండా ఏ కొత్త మందులు, ఇంజక్షన్లు వేసుకోవద్దు.
 
5. మన ఊపిరి మన రక్త ప్రసరణ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా మన శరీరం, వాలయాన్ని కట్టుకుంటుందని బాగా గుర్తుపెట్టుకోండి. 
 
టెన్సన్స్ లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి వల్ల ఇమ్మ్యూనిటి సిస్టం బాగా బిల్డ్ అవుతుందని అధ్యాయానాలలో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు