హౌసింగ్ లోన్‌పై ఆంక్షలు లేవు: ప్రభుత్వం స్పష్టం

గృహరంగానికి రుణకేటాయింపులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. హౌసింగ్ లోన్‌పై ప్రభుత్వం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఆర్ గోపాలన్ వెల్లడించారు. ఇటీవల కార్పొరేట్ స్థాయి గృహరుణాల మంజూరులో చోటుచేసుకున్న అవకతవకలు, లంచగొండి వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటువంటి కుంభకోణాలు మళ్లీ జరగకుండా ఉండేలా నియమావళిని పగడ్బందీగా రూపొందించుకోవాలని ప్రభుత్వం గోపాలన్ సూచించారు. గృహరుణాల కుంభకోణం ప్రభావంతో ఆ రంగంలో ధరలు పడిపోతాయని వస్తున్న పుకార్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తోసిపుచ్చారు.

వెబ్దునియా పై చదవండి