రాజీనామా చేయనున్న రోశయ్య: కొత్త సీఎంగా జైపాల్!!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. మంగళవారం రాత్రి 11 సమయంలో సీఎల్పీ భేటీ నిర్వహించాలని నంబర్ టెన్ జనపథ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయానికి పరిణామాలు మరింత శరవేగంగా మారిపోయాయి. ఈ సీఎల్పీ భేటీకి కేవలం పార్టీ వ్యవహరాల మంత్రి వీరప్ప మొయిలీ మాత్రమే హాజరవుతారని భావించారు.

అయితే, మధ్యాహ్నం 12 గంటలకు సీన్ మార్పిపోయింది. మొయిలీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లు వస్తున్నారు. ఈ ముగ్గురు కేంద్ర పరిశీలకులుగా వస్తున్నారు. సీఎల్పీలో కొత్త నేత ఎంపిక కోసమే ఈ ముగ్గురు వస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలావుండగా, ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం ఉదయం బ్యూరోక్రాట్లతో సమావేశమవుతున్నారు. సీఎం కార్యాలయాన్ని వీడే ముందుకు ఆ పదవిలో ఉండే వారు బ్యూరోకాట్లతో సమావేశం కావడం పరిపాటని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, రాజీనామా వ్యవహారాన్ని రోశయ్య ఇంకా అత్యంత గోప్యంగా ఉంచారు.

తన రాజీనామా అంశంపై ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వద్ద చర్చించి, ఆమె అనుమతి తీసుకున్న రోశయ్య.. కేంద్ర పరిశీలకులు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌కు సమర్పించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎల్పీ భేటీ సాయంత్రం 6.30 గంటలకు జరుగనుంది. ఇందులో కొత్త నేతను అంటే.. రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. ఈ నేత పేరు కూడా ఢిల్లీ నుంచే షీల్డు కవరులో రానుంది.

వెబ్దునియా పై చదవండి