కొత్త సీఎం రేసు: జైపాల్ రెడ్డి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు సీఎం రోశయ్య ప్రకటించారు. దీంతో కొత్త నేతపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త నేతను రాష్ట్ర స్థాయిలో నేతల నుంచి ఎంపిక చేస్తే ఆ పదవికి ప్రస్తుత సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

అయితే, మహారాష్ట్ర తరహాలో ప్రయోగం చేస్తే మాత్రం కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. అయితే, ఈ అంశంపై స్పష్టమైన సమాచారం అందించేందుకు కాంగ్రెస్ నేతలు ఇష్టపడటం లేదు.

రోశయ్య రాజీనామా చేయనున్నట్టు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వెల్లడించిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిని కలుసుకోవడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జైపాల్ రెడ్డిని ఎంపిక చేయవచ్చని గతంలోనే ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి