ప్రత్యేక తెలంగాణకు అనుకూలమైన వ్యక్తికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు చెందిన వ్యక్తినే నియమించకపోయినా, తెలంగాణకు అనుకూలమైన వ్యక్తిని నియమించడం అవసరమని దామోదర్ రెడ్డి మీడియాతో అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన వారిని సీఎంగా ఎంపిక చేయకూడదని అధిష్టానంతో విన్నవించనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు.
ప్రత్యేక తెలంగాణకు అనుకూలమైన వ్యక్తికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు చెందిన వ్యక్తినే నియమించకపోయినా, తెలంగాణకు అనుకూలమైన వ్యక్తిని నియమించడం అవసరమని దామోదర్ రెడ్డి మీడియాతో అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకమైన వారిని సీఎంగా ఎంపిక చేయకూడదని అధిష్టానంతో విన్నవించనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణాలోనే ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులున్నారని అలాంటి వారిని ఎంపిక చేయకుండా.. తెలంగాణపై సానుభూతి పరులకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని దామోదర్ రెడ్డి ఆశిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో.. సీఎం రేసులో కిరణ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జైపాల్ రెడ్డిలు ఉన్నారు. అలాగే సీఎం పదవికి రెడ్డి పేర్లు ఉన్నవారినే ఎంపిక చేయాలని అధిష్టానం పరిశీలకులు భావిస్తున్నారు.