ఇదే అదను... మన పవర్ చూపించాలి: జగన్ వర్గం

ముఖ్యమంత్రి రోశయ్య తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిన మరుక్షణం వైఎస్ జగన్ వర్గం హైదరాబాదులో రహస్యంగా సమావేశమైంది. ఈ సాయంత్రం లేదా రేపు ఏర్పాటు చేయబోయే సీఎల్పీ సమావేశంలో ఎటువంటి మార్గాన్ని అనుసరించాలన్న అంశంపై వారు తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే రోశయ్య రాజీనామా చేసిన పిదప సీఎం రేసులో వైఎస్ జగన్ పేరు కూడా ఉన్నట్లు వస్తుందనుకున్న వైఎస్ వర్గం ఆశలు అడియాసలయ్యాయి. సీఎం రేసులో జైపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పేర్లు ప్రస్తావనకు రావడం... ఆ తదుపరి గీతారెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. కనీసం వైఎస్ జగన్ పేరు ఎవరి చర్చల్లోనూ రాకపోవడం ఆ వర్గాన్ని నిరుత్సాహంలో ముంచినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోకుండా తమ వాణిని వినిపించాలని జగన్ వర్గం పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నట్లు భోగట్టా. ఇంకోవైపు బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ జగన్ సైతం తన వర్గీయులతో చర్చల్లో మునిగి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

వెబ్దునియా పై చదవండి