ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ సంస్కృతి: నాగం

ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి రోశయ్య తప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హఠాన్మరణం అనంతరం సీఎం బాధ్యతలను రోశయ్య చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలన సజావుగా సాగలేదన్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి, ప్రజలు మేలు చేసే నేత సీఎం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రధానంగా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించే నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు.

వెబ్దునియా పై చదవండి