నేపాల్‌లో మరోసారి రెపరెపలాడిన ఎర్రజెండాలు!

FILE
నేపాల్‌లో మరోసారి ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఈనెల 19న జరిగిన రెండవ రాజ్యాంగ సభలోని 601 స్థానాలకు గాను 575 సీట్లకు జరిగిన ఎన్నికలలో ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. గత ఎన్నికలలో రెండవ స్థానంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్‌, మూడవ స్థానంలో ఉన్న యుఎంఎల్‌ పార్టీలు మొదటి స్థానం కోసం పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.

పెద్ద పార్టీగా ఉన్న మావోయిస్టులు మూడో స్థానానికి చేరి అనూహ్య ఓటమికి గురయ్యారు. గత ఐదు సంవత్స రాలుగా నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచు కోవటంపై కొనసాగిన రాజకీయ సంక్షోభ పూర్వరంగంలో మొత్తం మీద కమ్యూనిస్టులకు మెజారిటీ ఓట్లు, సీట్లు రావటాన్ని బట్టి ఇప్పటికీ ఓటర్లు కమ్యూనిస్టులపైనే విశ్వాసం ఉంచారన్నది తేటతెల్లమైంది.

ఈ సభ కాలపరిమితి రెండు సంవత్సరాలు. గత సభలో ఒక ఒప్పందానికి రాలేకపోయిన కారణంగా గడువును నాలుగేళ్లకు పొడిగించారు. గతేడాది మే 28న సభ రద్దయింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ విధంగా రెండవ రాజ్యాంగ సభ ఎన్నికలు జరగలేదని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి