రాత్రిపూట కూడా గాలింపు సాగుతుంది: చిదంబరం

బుధవారం, 2 సెప్టెంబరు 2009 (19:44 IST)
ఆచూకీ తెలియని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణించే హెలికాఫ్టర్‌ కోసం రాత్రి పూట కూడా గాలింపు చర్యలు కొనసాగించనున్నట్టు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. దీనిపై ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు ఐదు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్ జవాన్లను రంగంలోకి దించారు. వీరితో పాటు.. రాష్ట్ర పోలీసుల బలగాలను, గ్రేహౌండ్స్ దళాలను వేల సంఖ్యలో గాలింపు చర్యలకు వినియోగిస్తున్నారు.

అలాగే, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి గాలింపు చర్యలకు స్వయంగా పూనుకున్నారు. చీకటిపడటం వల్ల అత్యాధునిక విమానాలను ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు హోం మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి ఆచూకీపై సమీక్ష జరిపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశం మేరకు హోం మంత్రి చిదంబరం, మరో మంత్రి వీరప్ప మొయిలీలు స్వయంగా హైదరాబాద్‌కు వస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి