వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఠాగూర్

శనివారం, 12 ఏప్రియల్ 2025 (17:41 IST)
బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్‌కు బిర్లా వారసురాలు అత్యంత ఖరీదైన బహమతిని ప్రదానం చేశారు. ఈ బాలీవుడ్ బ్యూటీకి అత్యంత ప్రేమతో రూ.5 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని కారును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, జాన్వీకి ఇంత కాస్ట్లీ బహుమతి బిర్లా వారసురాలు ఎందుకు ఇచ్చారన్న చర్చ ఇపుడు సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఈ బహుమతి ఇచ్చింది ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా. 
 
జాన్వీ కపూర్, అనన్య కపూర్‌ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇటీవల అనన్య బ్యూటీ ప్రాడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ బ్యాండ్‌కు ప్రచారకర్తగా జాన్వీ కపూర్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. తన బ్యూటీ ప్రాడక్ట్స్ బ్రాండ్‌కు జాన్వీ కపూర్ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన లంబోర్ఘిని కారును ఆమెకు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. 
 
శుక్రవారం ఉదయం లిలాక్ (పర్పుల్) రంగు లంబోర్ఘిని కారు జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ కారుతో పాటు మరో గిఫ్ట్ ప్యాక్ కూడా వచ్చింది. దానిపై "ప్రేమతో.. నీ అనన్య" అని రాసివుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కాగా, జాన్వీ కపూర్ గత యేడాది "దేవర"తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. తొలి సినిమాతోనే హిట్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు