ఆరుద్ర నక్షత్రమా..? ఐతే కీర్తియోగం వెన్నంటి ఉంటుంది..!

WD
రాహుగ్రహ నక్షత్రమైన ఆరుద్రలో జన్మించిన జాతకులు.. అద్భుతమైన హాస్య సంభాషణలు చేయడంలో చాకచక్యులు. జ్ఞాపకశక్తి, పట్టుదల, పలుకుబడి, మొండితనం కలిగివుండే ఈ జాతకులకు కీర్తియోగం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వాక్‌చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకునే ఈ జాతకులు అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వ్యాపారం చేయడంలో నైపుణ్యం కలిగివుండే ఈ జాతకులు, అన్ని రంగాల్లో రాణిస్తారు. కానీ ఆర్థిక పరమైన విషయాలపై సరైన సమయంలో మంచి నిర్ణయాలు చేయలేరు. తప్పుడు సలహాలు, పట్టుదల, ప్రతీకార వాంఛ వంటివి ఈ జాతకుల జీవితంలో పతనాలకు, ఒడిదుడుకులకు కారణం అవుతాయి.

ఇతరులు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇటుక రాళ్లవలే ఉపయోగపడే ఆరుద్ర నక్షత్ర జాతకులు, జీవితంలో ఎన్నిసార్లు జారిపడినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అయితే అవమానాన్ని మాత్రం సహించలేరు. లౌకికం తక్కువ. తల్లిదండ్రులు, సహోదరీ, సహోదరుల పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. స్త్రీల పట్ల గౌరవభావం కలిగి వుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. ఈ జాతకులకు బుధ, గురువారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. కానీ సోమవారం ఈ జాతకులు ఏ మాత్రం కలిసిరాలేదు. అలాగే పసుపు రంగు వీరికి శుభ ఫలితాలనిస్తుంది. అందుచేత ఎప్పుడూ పసుపు రంగు చేతిరుమాలును వాడటం మంచిది. ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఐదు అనే సంఖ్య అనుకూలిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి