చేతుల మీద మచ్చ ఉన్నట్లైతే ఇష్ట కార్యసిద్ధి అంటారు. కుడి చేతిమీద మచ్చవుంటే ధైర్యమును, బలమును కలిగివుంటారు. అదేవిధంగా ఎడమ చేతిపైన మచ్చ ఉన్నచో కార్యజయమును, మనోనిశ్చయమును కలిగివుంటారు.
మోచేతి చుట్టు భాగములందు మచ్చ ఉన్నచో కళంకమును, అసౌఖ్యమును, చపలచిత్తమును, మిత్రవిరోధమును కలిగివుందురు. అదే మోచేతుల మీదనే ఉన్నచో శ్రీమంతుడగును, సకల భోగముల ననుభవించును, మొత్తం మీద ఆ వ్యక్తి తన కాలమును సౌఖ్యముగా గడిపేస్తారు.
అరచేతి క్రింది భాగమున, మణికట్టుకు పై భాగమున కుడి, యెడమ చేతులలో ఏ చోటైన మచ్చ ఉన్నచో బాల్యము నందు ధనలోపముతో పలుబాధలకు లోనవుతారు. అయితే తరువాత చాలా ధనవంతులై సకల సౌఖ్యములను అనుభవిస్తారు.
చేతి మణికట్టుమీదనే పుట్టుమచ్చ ఉన్నచో హస్తభూషణము కలిగి ఉందురు. అలాగే చిత్ర పటములు వ్రాయుటయందు నేర్పును కలిగి ఉంటారు. ఇంకా దైవభక్తిని, గురుభక్తిని కలిగివుంటారు. ధనమునకు లోపము ఉండదు.
మణికట్టు నుండి మునివేళ్ళదాకా మోచేతి వరకు ఎక్కడ ఉండినను సకలసంపదలు కలిగి సుఖముగా ఉంటారు. మొత్తము మీద ఆ వ్యక్తికి దేహపరిశ్రమకు సంబంధించిన వృత్తులనే అవలంబించును.