మీ నెంబర్ తొమ్మిదా...? శృంగార ప్రియులు

WD
పుట్టిన రోజును అనుసరించి ఆయా వ్యక్తుల గుణగణాలను చెప్పవచ్చంటోంది సంఖ్యా శాస్త్రం. సహజంగా చాలామంది నెం.9 పై అత్యంత శ్రద్ధ పెడుతుంటారు. 9 అంకె గల వీధిలో ఇల్లు కొనుగోలు చేయాలని ఒకరు అనుకుంటే, ఆ అంకెతో మొదలయ్యే కారు నెంబరు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు మరికొందరు. అంతెందుకు ప్రముఖ మొబైల్ కంపెనీలన్నీ తమతమ సెల్‌ఫోన్ నెంబర్లను 9తోనే మొదలుపెట్టడాన్ని చూస్తే 9కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది.

ఇంతకీ ఈ తొమ్మిది నెంబరు గల వ్యక్తి గుణగణాలు ఎలా ఉంటాయంటే....
వీళ్లు ఖచ్చితంగా సున్నిత మనస్కులు. అంతేకాదు ఆధ్యాత్మిక భావాలు పుష్కలంగా ఉంటాయి. ఎదుటివారి కష్టాలను చూసి ఇట్టే కరిగిపోతారు. దయగల హృదయులై ఉంటారు. ఇక ఇతర విషయాలకు వస్తే, వీరికి కళా రంగాల పట్ల ఎనలేని ప్రీతి ఉంటుంది. అంతేకాదు శృంగారంలో మునిగి తేలడం వీరికి మహా ఇష్టం. మొత్తానికి వీరు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు. కొన్నిసార్లు ఎదుటివారి పన్నాగానికి బోల్తా కొట్టినా ఆ తర్వాత తేరుకుంటారు.

నా అంకెను తెలుసుకునేదెలా...?
సంఖ్యా శాస్త్రంలో ఎవరి అంకె ఏది అని తెలుసుకోవడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే ఈ సంఖ్యను తెలుసుకోవడం చాలా సులభం. పుట్టినరోజు లేదా పేరులోని అక్షరాల సాయంతో మీ మీ సంఖ్యలను తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు మీ పుట్టినరోజు సెప్టెంబరు 30, 1970 అనుకోండి...
30 09 1970
అంటే... 1970+09+30 =1989 = 1+9+8+9 = 27 = 2+7 = 9

ఇలాకాకుండా అక్షరాలను ఆధారం చేసుకుని చూడాల్సి వచ్చినప్పుడు...
A N I L
1 14 9 12 1
1+14+9+12 =36 = 3+6 = 9

వెబ్దునియా పై చదవండి