శని దోషాలంటే ఏమిటి? ఎన్ని రకాలు?

బుధవారం, 17 సెప్టెంబరు 2008 (18:50 IST)
ప్రతి ఒక్క గ్రహం నుంచి పాజిటివ్, నెగటివ్ అనే రెండు రకాలైన శక్తి తరంగాలు ఒక కాంతి కిరణంలో ప్రయాణం చేసి, ఈ భూమిపైకి చేరుతాయి. ఈ క్రమంలో భూమిపై వున్న సమస్త జీవ, నిర్జీవ రాశులన్నింటినీ చేరుతాయని జ్యోతిష్కుల వాదన. దీని ప్రకారం పాజిటివ్ కిరణాలు శుభాన్ని, లాభాన్ని కలిగిస్తే, నెగటివ్ కిరణాలు కష్టాలను, బాధలను, దుఃఖాన్ని, నష్టాన్ని కలిగిస్తాయని వారు పేర్కొంటున్నారు.

అయితే శని గ్రహం మూడు ప్రత్యేక దోష శక్తి కిరణాలను ప్రసరింపజేస్తుంది. ఈ దోష కిరణాల ప్రభావం పొందిన "రాశి" వారు తీవ్రమైన నష్టాలను, బాధలను, కష్టాలను పొందుతారు.

ఇక శనిగ్రహం మూడు ప్రత్యేక దోషాలు ఏమిటంటే...
1. ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం.
2. రెండున్నర సంవత్సరాల అష్టమ శని దోషం.
3. రెండున్నర సంవత్సరాల అర్ధ అష్టమ శని దోషం.

పై దోషాలను పొందిన వారు ఆయా దోష నివారణలు చేయించుకోకపోతే ఈ దోషాలలోని నెగటివ్ శక్తుల ప్రభావం తప్పక ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. దీని ప్రకారం జాతకులు జ్యోతిష్కుల గణాంకాల ప్రకారం శని దోష నివారణ పూజలు చేయించుకున్నట్లైతే పాజిటివ్ శక్తిని పొంది మంచి ఫలితాలు దరి చేరుతాయని జ్యోతిష్క శాస్త్రం పేర్కొంటుంది.

వెబ్దునియా పై చదవండి