శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోవడం అశుభ సూచకమా..?!

FILE
సుప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వరాలయ భారీ రాజ గోపురం.. 500 సంవత్సరాల పురాతనమైందని.. అందుకే కుప్పకూలిందని అధికారులు చెబుతున్నా.. శ్రీకృష్ణదేవరాయలు 1516 సంవత్సరంలో నిర్మించిన శ్రీకాళహస్తీశ్వర రాజగోపురం కూలిపోవడం అశుభసూచకమని భక్తులు భావిస్తున్నారు.

పరమేశ్వరుడు వాయులింగంగా వెలసిన శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజలను చేయించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూపోతుంటారు. ఈ నేపథ్యంలో పురాతన ఆలయంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలోని 140 అడుగుల ఎత్తు రాజగోపురం కూలిపోవడం అశుభ సూచకమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ విషయమై జ్యోతిష్యనిపుణులు ఏమంటుంటున్నారంటే..? బుధవారం మధ్యాహ్నం 12.58 నిమిషాలకు స్తంభించిన కుజుడు సింహ ప్రవేశం చేశాడు. ఆ కారణంగా కానీ లేదా ఆంధ్ర రాష్ట్రం మీద శని సంచార ప్రభావం ఉండటం వల్ల కానీ, విశాఖ నక్షత్రం దోషం వల్ల కానీ బుధవారం రాత్రి 8 గంటలకు బీటలు వారిని రాజగోపురం నేలకొరిగింది.

శ్రీకాళహస్తీశ్వరుని గాలిగోపురం నేలకొరగటం వల్ల ప్రజల్లో అశాంతి, అవగాహనా లోపం, పరమత ప్రచారం అధికమవుతాయి. హిందూ దేవాలయాల్లో భద్రతాలోపం వంటివి అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఈ దోషం 2011 సంవత్సరం మే నెల వరకూ ఉంటుంది.

కనుక ప్రజలందరూ స్నేహ భావంతో కలిసి మెలిసి ఉండటం చాలామంచిది. కొత్తగా అనారోగ్యాలు తలెత్తే అవకాశంతోపాటు పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఈ దోష నివారణకు శ్రీకాళహస్తీశ్వరుడిని పూజించడం, శ్రీమన్నారాయణుని ఆరాధించడం వల్ల ప్రజలకు శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి