మహాలయ అమావాస్య- అప్పు చేసి శ్రాద్ధ కర్మలు చేయకూడదు..

సెల్వి

మంగళవారం, 1 అక్టోబరు 2024 (20:29 IST)
మహాలయ అమావాస్య పితరుల పూజకు అంకితం. ఈ పవిత్రమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం ఇస్తారు. తర్పణాలు ఇస్తారు. పితృపక్షం ఈ రోజుతో పూర్తవుతుంది. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు నల్ల నువ్వులను తప్పనిసరిగా వాడాలి. 
 
నల్ల నువ్వులు తీర్థ జలాలను కలిగి ఉన్నాయని, దాని వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారని, దీవెనలు ఇస్తారని నమ్ముతారు. సర్వ పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టే సంప్రదాయం ఉంది. తద్వారా పితృదేవతల ఆత్మ శాంతిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
గరుడ పురాణం ప్రకారం పితృ పక్షం సమయంలో పూర్వీకులు ఏ రూపంలోనైనా రావచ్చు. అటువంటి పరిస్థితిలో సర్వ పితృ అమావాస్య రోజున ఎవరైనా మీ ఇంటి ముందుకు ఆకలితో వచ్చి పిలిస్తే వారిని వెనక్కి పంపకూడదు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి. 
 
ఈ రోజున మొదటి ఆహారం ఆవుకు, రెండవది శునకానికి, మూడవది కాకికి, నాల్గవది దేవతకు, ఐదవది చీమలకు ఆహారం తీస్తారు. ఈ రోజున డబ్బు, వస్త్రాలు, ధాన్యాలు, నల్ల నువ్వులు ఎవరి శక్తి మేరకు దానం చేస్తారు.
 
ఆకు, వెండి, రాగి, కంచుతో చేసిన పాత్రలలో ఆహారాన్ని అందించవచ్చు. శ్రాద్ధ ఖర్మలు అప్పు తీసుకుని చేయకూడదు. ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, దూషించే పదాలు వాడకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు