ఈ సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూంటే నవగ్రహ భూతగ్రహాదుల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి. ఆదివారం నాడు స్త్రీ సంభోగం చేయరాదు. తలకు నూనెపూసుకోరాదు. తలంటు స్నానం చేయరాదు. మద్యపానం చేయరాదు. మాంసము తినరాదు. ఈ చేయరాని పనులు చేస్తే వీటి దుష్ర్పభావము ఏడు జన్మలు వెంటనే వస్తాయని పండితులు అంటున్నారు. వీటిని విడుచువారు. సమస్తబాధలు తొలగి వ్యాధులు దగ్గరికి రాక దుఃఖాలను అనుభవించక దారిద్ర్యబాధలేక ఐహికసుఖాలు అనుభవించి కడపటికి సూర్యలోకం చేరుతారని ఈ సూర్యాష్టక అర్థం.