రాశి ఫలితాలు (14-06-17)... నూతన పరిచయాలతో జాగ్రత్త...

మంగళవారం, 13 జూన్ 2017 (22:03 IST)
మేషం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు విసుగుపుట్టిస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నముగా పూర్తి చేస్తారు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం : సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య అవగాహనాలోపం ఏర్పడుతుంది. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాల్లో వారికి లాభదాయకం. 
 
మిథునం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చు తప్పులు పడుట వలన మాటపడవలసి వస్తుంది.
 
కర్కాటకం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సేల్స్ సిబ్బందితో లౌక్యంగా మెలగాలి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం: వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం, ఆదాయం స్వల్పం. ప్రేమికులకు ఎడబాటు ఊహించని చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాల్లో చికాకులు, ఇబ్బందులు వంటివి తప్పవు.
 
కన్య : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలదు. విద్యుత్, ఏసీ కూలర్ మెకానికల్ రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది. చెక్కుల జారీ స్వీకరణలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.
 
తుల : దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఫీజులు, పన్నులు, రుణవాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి. శారీరక పటుత్వం నెలకొంటాయి. నిరుద్యోలకు రాత, మౌఖిక పరీక్షల్లో మెలకువ అవసరం. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య బాంధవ్యాలు బాగా ఉంటాయి.
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకైనా పూర్తిగా అందుతుంది. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తంపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
మకరం : ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం అందుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. 
 
కుంభం : ఆదాయానికి తగట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
 
మీనం : కళా, ఫోటోగ్రఫీ ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాల వారికి అనుకూలం సమయం బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

వెబ్దునియా పై చదవండి