మాజీ ప్రేయసి గురించి మాట్లాడేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ శింబు తన మాజీ లవర్ నయనతార గురించి నవ్వుతూ మాట్లాడారు. ప్రభుదేవా ఎంట్రీ ఇవ్వడంతో శింబు-నయనతార లవ్వాయణం బ్రేకప్ అయ్యింది. ఆపై ప్రభుదేవా-నయన ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది. అయినప్పటికీ శింబు నయనతార బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమా చేశారు. రొమాన్స్ పండించారు.
ఐతే శింబు ఓ అడుగు ముందుకేశాడు. తన మాజీ ప్రేయసి కొత్త ప్రేమాయణం గురించి ఓ మీడియా సమావేశంలో మొహమాటం లేకుండా స్పందించాడు. తన కొత్త సినిమా ‘వాలు’ విజయోత్సవంలో భాగంగా శింబు ప్రెస్ మీట్ పెట్టగా.. డైరెక్టర్ విఘ్నేష్‌తో నయనతార ప్రేమాయణం గురించి మీరేమంటారు అంటూ శింబును సూటిగా ప్రశ్నించాడు ఓ విలేకరి. శింబు నో కామెంట్ అని తప్పించుకోకుండా దీనికి నవ్వుతూ సమాధానమిచ్చాడు.