లక్ష్మీదేవి మీ ఇంట కొలువై వుండాలంటే ఏం చేయాలి?

బుధవారం, 13 మార్చి 2019 (21:51 IST)
డబ్బుకు లోకం దాసోహం అని అంటారు మన పెద్దలు. కానీ.... అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడు ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తన ను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి.... లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటంటే........
 
1. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. 
 
2.మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది.
 
3. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి.
 
4. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు.
 
5. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీలక్ష్మీదేవి నిలువదని పురోహితులు అంటున్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు