శ్రీవారి భక్తులు ఈనెల 26వ తేదీ తిరుమల రావొద్దండి, ఎందుకంటే?

సోమవారం, 16 డిశెంబరు 2019 (19:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 26వ తేదీన మూసివేయనున్నారు. పదమూడు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి ఉన్నతాధికారులు తెలిపారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
 
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆలయాన్ని శుద్థి చేసి ఆ తరువాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయాన్ని మూసి వేసిన సమయంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సమయంలో వితరణ నిలిపివేయనున్నారు. అలాగే గ్రహణం కారణంగా తిరుప్పావడ సేవ, కళ్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేయనుంది. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు టిటిడికి చెందిన అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు