ముందుగా ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణమండపంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ట ఆవాహన, నవకలశ ప్రతిష్ట ఆవాహన, కంకణ ప్రతిష్ట అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, అచమనీయం చేసి కంకణధారణ చేశారు.
ఆ తరువాత శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదపండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.