నేడు 1.11.11 : క్యాలెండర్‌లో అద్భుతం..!

మంగళవారం, 1 నవంబరు 2011 (11:09 IST)
FILE
మన క్యాలండర్‌లో తొలిసారిగా ఒకే రోజు ఐదు ఒకట్లు మరోసారి దర్శనమివ్వబోతున్నాయి. సాధారణంగా పది లేక వంద సంవత్సరాలకు కానీ ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకోదు. ఇటువంటి అరుదైన తేదీ ఈ ఏడాది రెండు సార్లు సంభవించడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 11 క్యాలండర్‌ ఐదు ఒకట్లు ఒకేసారి వచ్చాయి, (11.1.11).

కాగా ఇదే నెల 11వ తేదీన మరో అద్భుతం చోటు చేసుకోనుంది. వంద సంవత్సరాలకు ఒకసారి సంభవించే ఆరు ఒకట్లు (11.11.11) ఒకసారి క్యాలండర్‌పై దర్శన మివ్వనున్నాయి. ఈ అద్భుతం 1911, నవంబర్‌ 11న, తిరిగి 2111, నవంబర్‌ 11న మాత్రమే జరుగనుంది.

2001, 2011 తేదీలు దాదాపు ఒకే మాదిరి ఉన్నప్పటికీ ఈ ఏడాది సంవత్సరపు సంఖ్యలో రెండు ఒకట్లు ఉండడం గమనార్హం. క్యాలండర్‌లో ఒకే నంబర్‌ ఎక్కువ సార్లు కనిపించడం తిరిగి 2022లోనూ సంభవిస్తాయి. ఆ ఏడాది 2.2.22, 22.2.22 తేదీలలో రెండు నెంబరు పలుమారు దర్శనమిస్తుంది.

వెబ్దునియా పై చదవండి