శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా ఇకపై ఆధార్‌ను తప్పనిసరి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా తొలి దశలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్ తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉండేవారికి మాత్రం పాస్ పోర్ట్ నెంబరును ఆప్షన్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఆధార్ తప్పనిసరిపై ఇప్పటికిప్పుడు భక్తులపై ఒత్తిడి చేయబోమని అధికారులు చెప్తున్నారు.