చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

సెల్వి

బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (21:32 IST)
Padmavathi Ammavari Bramotsavams
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల సమయంలో పద్మావతీ అమ్మవారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 
 
అమ్మవారిని యోగనరసింహుని అలంకరణలో వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
Padmavathi Ammavari Bramotsavams
 
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 26 వరకు వైభవంగా జ‌రుగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు