తిరుమలలో తితిదే ఈఓ సాంబశివరావు, జెఈఓ శ్రీనివాసరాజులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సర్వదర్శనం క్యూలైన్ల నుంచి కంపార్టుమెంట్లలోకి వెళ్ళే నారాయణగిరి క్యూలైన్లతో పాటు మరికొన్ని లైన్లను వీరు పరిశీలించారు. భక్తులతో స్వయంగా మాట్లాడిన ఈఓ వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. క్యూలైన్లలోకి వెళ్లేటప్పుడు శ్రీవారి సేవకులతో పాటు తితిదే సిబ్బంది మర్యాదపూర్వకంగా మజ్జిగ, నీటిని పంపిణీ చేస్తున్నట్లు భక్తులు ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.