కమలనాథులతో రమణ దీక్షితులు మంతనాలు.. బీజేపీలో చేరుతారా?

బుధవారం, 23 మే 2018 (17:42 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు భారతీయ జనతా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత శ్రీవారి వంటశాలలో తవ్వకాలు... శ్రీవారి నగలపై పలు సంచలన ఆరోపణలు చేశారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో సమావేశమయ్యారు. టీటీడీలో పలువురు చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానని ఇటీవలే సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.
 
ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు కూడా ఇటీవల డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రమణ దీక్షితులు మరికొంత మంది బీజేపీ నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
శ్రీవారి ఆలయంలో జరిగే పలు అవకతవకలపై రమణదీక్షితులు అనేక రకాల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనకు చెక్ పెట్టేలా వయోపరిమితిని తెరపైకి తెచ్చి.. 65 యేళ్లు దాటిన వారిని ప్రధాన అర్చకుడిగా ఉండకూడదని పేర్కొంటూ ఆ విధుల నుంచి తొలగించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు