తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత ఆన్ లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్ లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వర్చవల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కళ్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులు మాత్రం…ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. కళ్యాణోత్సవ టికెట్లు పొందిన గృహస్తులు (ఇద్దరు) తమకు సౌకర్యవంతమైన తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రుసుము ఉండదు.