భారీ నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

శుక్రవారం, 27 జనవరి 2023 (18:30 IST)
బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు పడిపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూశాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపారు. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీ బీఎస్ఈ  874 పాయింట్ల నష్టంతో 59,330 వద్ద ముగిసింది. 
 
బుధవారం 17,891 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,877 వద్ద ఓపెనైంది. 17,493 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,884 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టంతో 17,604 వద్ద క్లోజైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు