అరేబియా సముద్రంలో ఆ ఇద్దరు ఈతకొట్టారు. అస్థిరమైన అరేబియా జలాలలో ఈత కొట్టిన ఆ ఇద్దరు అరుదైన ఫీట్‌ను, నమ్మశక్యం కానీ ఫీట్‌ను నమోదు చేసుకున్నారు. వారి పేర్లు గౌర్వీ అభిషేక్, సుభ్ శింఘ్వీ.
ఉదయ్‌పూర్‌కు చెందిన ఈ ఇద్దరు... రెండేళ్ల పాటు అరేబియా సముద్రంలో సోలోగా స్విమ్ చేశారు. గడ్డకట్టే మంచు, భారీ గాలులతో కూడిన వాతావరణాన్ని ధిక్కరించి సోలోగా గౌర్వీ అభిషేక్, సుభ్ సింఘ్వీలు అరేబియా సముద్రంలో ఈతకొట్టారు.
ఆమె ఘనతపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గడ్డకట్టే మంచులో గౌర్వీ అభిషేక్, సుభ్ సింఘ్వీలు అద్భుతంగా స్విమ్ చేశారని.. మా మేనకోడళ్ల ధైర్యాన్ని తలచి గర్వపడుతున్నానని గౌర్వీ అభిషేక్, సుభ్ సింఘ్వీల మేనత్త ట్వీట్ చేసింది. సెలెబ్రేషన్స్ కూడా సమయం వచ్చిందని కామెంట్ చేసింది. ప్రస్తుతం గౌరవీ స్విమ్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి