మరోసారి వర్షపు పంజాలో చిక్కనున్న కేరళ.. చెన్నైకీ చిక్కే

సోమవారం, 8 అక్టోబరు 2018 (17:46 IST)
కేరళ మరోసారి వర్షపు పంజాలో చిక్కే అవకాశం వుంది. కేరళ రాష్ట్రానికి మరో ముప్పు పొంచివుంది. అరేబియా సముద్రంలో కొత్త తుఫాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్‌కు లూఫన్ పేరు కూడా పెట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 
 
లూఫన్ ప్రభావం వల్ల కేరళకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇడుక్కి, పలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. కేరళ మాత్రమే కాకుండా లూఫన్ తుఫానుతో  కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
అలాగే చెన్నై, పుదుచ్ఛేరిలలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు, కేరళ వరదల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏర్పడే తుఫాను కారణంగా ఈ శనివారం నుంచి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు