కోక్ తాగొద్దు.. మంచినీరు తాగండి.. క్రిస్టియానో రొనాల్డ్

మంగళవారం, 15 జూన్ 2021 (13:09 IST)
పోర్చుగ‌ల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో. ఈ అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు... ప్రస్తుతం యూరో చాంపియ‌న్‌షిప్‌ పోటీల్లో భాగంగా మంగ‌ళ‌వారం త‌న తొలి మ్యాచ్ ఆడ‌బోతున్నాడు. హంగ‌రీతో బుడాపెస్ట్‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 
 
ఈ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. అయితే మీడియా స‌మావేశానికి వ‌చ్చి కూర్చుంటున్న స‌మ‌యంలో అత‌ని ముందు రెండు కొకాకోలా బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూడ‌గానే అత‌డు తీసి ప‌క్క‌న పెట్టేశాడు. ఇది ప‌క్క‌నే కూర్చున్న కోచ్ శాంటోస్‌తోపాటు మీడియాను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 
 
అత‌ను ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత వెంట‌నే అత‌డే అస‌లు విష‌యాన్ని చెప్పాడు. కోలా బ‌దులు నీళ్లు తాగండి అంటూ అక్క‌డే ఉన్న వాట‌ర్ బాటిల్‌ను చేతికి తీసుకుని పైకెత్తి చూపించాడు. వ‌ర‌ల్డ్‌లోని బెస్ట్ ఫుల్‌బాల‌ర్స్‌లో ఒకడిగా ఎదిగిన రొనాల్డో.. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. 
 
ఇందులోభాగంగా, ఆయన జంక్‌ ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడు. యూరో క‌ప్ అనే కాదు కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు కోలాలాంటి డ్రింక్ కంపెనీలే స్పాన్స‌ర్ చేస్తుంటాయి. వాటిని ప్లేయ‌ర్స్ మీడియా స‌మావేశాల్లోనూ ప్ర‌దర్శించాల‌నుకుంటాయి. కానీ రొనాల్డోలాంటి స్టార్ ప్లేయ‌రే ప‌బ్లిగ్గా ఇలా కోలాలు వ‌ద్ద‌ని చెప్ప‌డం అలాంటి కంపెనీలకు మింగుడుప‌డ‌ని విషయంమే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు