లైక్స్‌‌ను తొలగించే అవకాశాన్ని అందిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌- ఫేస్‌బుక్‌

గురువారం, 27 మే 2021 (23:06 IST)
గత కొంతకాలంగా మీరు పరిశీలించినట్లయితే లైక్‌ కౌంట్స్‌ను దాయటం గురించి మేము పరీక్షలు చేస్తున్నట్లుగా మీరు గమనించే ఉంటారు. నేడు, మేము ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌బుక్‌పై ప్రతి ఒక్కరికీ తమ పబ్లిక్‌ లైక్‌ కౌంట్స్‌ను కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు వెల్లడిస్తున్నాం. తద్వారా తమకు ఏదైతే ఉపయోగముంటుందని ఆశిస్తున్నారో వారు నిర్ణయించుకోవచ్చు.
 
మేము లైక్‌ కౌంట్స్‌ను పరీక్షించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రజల అనుభవాల పరంగా ఏమైనా ఒత్తిడి కలుగుతుందా అని పరీక్షించాం. ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి మేము విన్నదాని ప్రకారం లైక్‌ కౌంట్స్‌ కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి ఇది బాధను మిగులుస్తుంది, ఎందుకంటే, కొంతమంది ప్రజలు లైక్‌ కౌంట్స్‌ను ఏది ట్రెండింగ్‌లో ఉంది లేదంటే ప్రాచుర్యంలో ఉందనే అంశాల కోసం వినియోగిస్తున్నారు. అందువల్ల మేము వారికి ఓ అవకాశం అందిస్తున్నాం.
 
ప్రజలకు తమ అనుభవాలను మరింతగా నియంత్రించుకునేందుకు మరిన్ని మార్గాలను అందించేందుకు తగిన అవకాశాలను చూస్తున్నాం. ఈ కారణం చేతనే మేము నూతన టూల్స్‌ను ప్రకటించాం. ఇవి ప్రజలు తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్‌ను ఫిల్టర్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఫేస్‌బుక్‌ యొక్క న్యూస్‌ ఫీడ్‌పై తాము ఏది చూస్తున్నాం మరియు పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణను సైతం అందిస్తుంది. అంటే ఫీడ్‌ ఫిల్టర్‌ బార్‌; ఫేవరేట్స్‌ ఫీడ్‌ మరియు చూజ్‌ హూ కెన్‌ కామెంట్‌‌లా ఫిల్టర్‌ చేసుకోవచ్చు
 
పబ్లిక్‌ లైక్‌ కౌంట్స్‌ దాచడానికి కొత్త అవకాశాలు
నేటితో ఆరంభించి, మేము మీకు లైక్‌ కౌంట్స్‌ను దాచుకునే అవకాశాన్ని మీ ఫీడ్‌కు సంబంధించి అన్ని పోస్ట్‌లపై అందిస్తున్నాం. అలాగే మీకు మీ సొంత పోస్ట్‌లపై సైతం లైక్‌ కౌంట్స్‌ను దాచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇతరులు మీ పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయని తెలుసుకోలేరు. ఈ విధంగా, మీరు చేసిన పోస్ట్స్‌కు ఎన్ని లైక్‌లు వచ్చాయన్న అంశంపై దృష్టి సారించకుండా, మీకు నచ్చితే, మీరు షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలపై దృష్టి సారించవచ్చు.
 
మీరు సెట్టింగ్స్‌పై న్యూ పోస్ట్స్‌ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్‌లపై  లైక్‌ కౌంట్స్‌ను సైతం మీరు దాయవచ్చు. ఇది మీ ఫీడ్‌లో అన్ని పోస్ట్‌లకూ వర్తిస్తుంది. మీరు ఓ పోస్ట్‌ను షేర్‌ చేసే ముందుగా లైక్‌ కౌంట్స్‌ను హైడ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఈ సెట్టింగ్‌ను ఒక వేళ పోస్ట్‌ లైవ్‌లోకి వెళ్లినప్పుడు సైతం ఆన్‌ లేదా ఆఫ్‌ చేయవచ్చు. ఇప్పుడు ప్రజలు మరింత సౌకర్యం కోరుకుంటున్నారు. అందువల్ల , ప్రజలకు ఆ అవకాశం అందించడం ముఖ్యమని భావిస్తున్నాం. రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్‌ అన్నీ కూడా ఫేస్‌బుక్‌పై కనిపించనున్నాయి.
 
నిపుణులు మరియు క్రియేటర్లతో భాగస్వామ్యం
ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఏవైతే అనుభవాలను పొందాలనుకుంటున్నారో వారికి భిన్నంగా మరొకరు ఈ అనుభవాలను కోరుకుంటుంటారు. అలాగే ప్రజల అవసరాలు కూడా మారుతున్నాయి. మేము తృతీయ పక్ష నిపుణులతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ఏ విధంగా ప్రజలకు తగిన శక్తిని అందించాలో అర్థం చేసుకుంటున్నాం, అలాగే స్వీయ అవగాహన నిర్మించుకుంటూనే ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత సానుకూల అనుభవాలను అందిస్తున్నాం.
 
ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రజల అనుభవాలకు సంబంధించి మరింతగా బాహ్య పరిశోధన అందించేందుకు మేము నిధులను సమకూరుస్తున్నాము. అదే రీతిలో మా విధానాలను, ఉత్పత్తులను మెరుగుపరుచుకోవడం ద్వారా కమ్యూనిటీకి మద్దతునందించగలమో కూడా  చూస్తున్నాము. ప్రస్తుతం మేము అంతర్జాతీయంగా విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థల నుంచి పరిశోధనా ప్రతిపాదనలను ఆహ్వానించాం. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మీరు మరింత సమాచారాన్ని  research.fb.com/programs/research-awards/proposals/2021-instagram-request-for-proposals-on-safety-and-community-health/ వద్ద పొందడటంతో  పాటుగా ఏ విధంగా సబ్మిట్‌ చేయవచ్చో కూడా తెలుసుకోవచ్చు.
 
భారతదేశంలో మేము ఇటీవలనే యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌షిప్‌ (వైలాక్‌)తో భాగస్వామ్యం చేసుకుని కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ ఐదవ సంచికను ఆరంభించాం. ఈ కార్యక్రమం ద్వారా సృజనాత్మక ఆలోచనలు కలిగిన యువతరం విజువల్‌ స్టోరీ టెల్లింగ్‌ శక్తిని వినియోగించుకుని అర్ధవంతమైన సంభాషణలను యువతరానికి అతి ముఖ్యమైన అంశాల పట్ల ప్రపంచవ్యాప్తంగా చేసే వీలు కలుగుతుంది. దీనిలో వేధింపులు, వైవిధ్యత, మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలు సైతం ఉంటాయి.
 
లైక్‌ కౌంట్స్‌ను ప్రజలు చూస్తోన్న తీరు మారడం అతి పెద్ద మార్పుగానే చూడాలి. ప్రజలకు మరిన్ని అవకాశాలను అందించేందుకు ఉన్న మార్గాలపై మేము కృషి చేస్తున్నాము. అందువల్ల వారు యాప్‌లపై వెచ్చించే సమయం పట్ల చక్కటి అనుభూతి పొందగలరు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు