ఈ టోర్నీలోభాగంగా గురువారం రాత్రి స్విట్జర్‌ల్యాండ్‌లోని జురిచ్‌లో జరిగిన ఫైనల్ పోటీలో చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో ఆరు మెటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ చాంపియన్ పోటీలో నీరజ్ చోప్రా తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లుగా విసిరి విజేతగా నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
కాగా, గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరమైన చోప్రా.. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని జూలై ఆఖరులో లాసానె డైమండ్ లీగ్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్‌లో ఫైనల్స్ ఆడినా... వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు.