ఈ కాల్పుల్లో సందీప్ నంగర్ తల, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా తుపాకీ కాల్పులు వినగానే స్టేడియంలోని ప్రేక్షకులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఆ తర్వాత దుండుగులు సందీప్‌ను కాల్చిపారిపోయారు. సందీప్ గత పదేళ్లకు పైగా కబడ్డీ క్రీడలో రాణిస్తున్నాడు.
కాగా, జలంధర్‌లోని షాకోట్‌కు సమీపంలోని నంగల్ అంబియన్ గ్రామానికి చెందిన సందీప్.. ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తరచుగా కబడ్డీ టోర్నలు నిర్వహిస్తున్నాడు. కబడ్డీ ప్రపంచాన్ని సందీప్ దాదాపు పదేళ్లపాటు శాసించాడు. సందీప్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.