ఈ సందర్భంగా పీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులకు మోదీ అభినందనలు తెలియజేశారు. గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందిన పీవీ సింధూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో వెండిపతకాన్ని తీసుకొచ్చి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రధాని గుర్తు చేశారు.