స్పెయిన్ బుల్‌కు గాయం... వింబుల్డన్ నుంచి నిష్క్రమణ

శుక్రవారం, 8 జులై 2022 (20:15 IST)
Nadal
వింబుల్డన్‌ నుంచి స్టార్ టెన్నిస్ ప్లేయర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తప్పుకున్నాడు. పొత్తి కడుపు కండర గాయంతో వింబుల్డన్‌ నుంచి వైదొలగుతున్నట్టు రఫా గురువారం అర్ధరాత్రి ప్రకటించాడు. దీంతో శుక్రవారం సెమీఫైనల్లో నడాల్‌తో తలపడాల్సిన ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోసకు వాకోవర్‌ లభించింది.
 
టేలర్‌ ఫ్రిట్జ్‌తో క్వార్టర్‌ఫైనల్లో రెండో సెట్‌లో గాయంతోనే నడాల్‌ టైమవుట్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో డాక్టర్‌.. 36 ఏళ్ల నాదల్‌కు నొప్పి తగ్గే మాత్రలు ఇవ్వగా, ట్రెయినర్‌ పొత్తి కడుపువద్ద మసాజ్‌ చేశాడు. మొత్తంగా బాధను భరిస్తూనే నడాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌ను ముగించాడు. 
 
వింబుల్డన్ సెమీస్‌ ఆడతాడని భావించినా గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు రఫా ప్రకటించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు