ఇంకా సానియా మీర్జా మాట్లాడుతూ.. తన బయోపిక్ తీసే విషయంలో దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. తనది ఎలాంటి వ్యక్తిత్వమో , తన కెరీర్‌ను మొదటి నుంచి చూసిన ఎవరికైనా అర్థమౌతుందని తెలిపింది. తానొకటి, తన మనసొకటి మాట్లాడదని.. అలా ఏదీ దాచుకోనని వెల్లడించింది. తనకు ఏది అనిపిస్తే అదే చేస్తానని.. ఏ విషయాన్నైనా బయటికి చెప్పేస్తానని పేర్కొంది.