వింబుల్డన్ నిర్వాహకులు సాంప్రదాయం పేరుతో విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మాజీ వరల్డ్ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా తాజాగా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్ మెర్టెన్స్తో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్ బయటకు కనిపించింది. ఈ విషయాన్ని టోర్నీ అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్లో విరామం సమయంలో వీనస్ లాకర్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు ‘బ్రా’తో బరిలోకి దిగింది.