How much prize money India’s D Gukesh గుకేశ్‌ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఠాగూర్

శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:28 IST)
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత చదరంగ ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు విశ్వవిజేతగా నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను చిత్తు చేసి గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయంతో 18 యేళ్లకే వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అతిచిన్న వయస్కుడిగా గుకేశ్ నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
అయితే, వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. కాగా, గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 1.35 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు. భారత కరెన్సీలో సుమారుగా రూ.11.45 కోట్లు. అలాగే రన్నరప్ డింగ్‌కు 1.15 మిలియన్ డాలర్లు (రూ.9.75కోట్లు) ఇస్తారు. 
 
మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు ఇస్తారు. దీని ప్రకారం 3 గేమ్‌లలో గెలిచిన గుకేశ్‌కు రూ.5.09 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన డింగ్‌కు రూ.3.39 కోట్లు లభించాయి. మిగిలిన దాన్ని సమానంగా పంచారు. దాంతో గుకేశ్ మొత్తం రూ.11.45 కోట్లు గెలుచుకోగా, డింగ్ రూ.9.75 కోట్లు అందుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు