బెంగాల్ క్రికెట్ అధ్యక్ష (క్యాబ్) ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వచ్చిన వార్తలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ఖండించారు. మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో అణుమాత్రం నిజం లేదని, అవన్నీ మీడియా సృష్టేనని చెప్పుకొచ్చాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ దాల్మియాపై పోటీ చేయాలని కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం అడ్మినిస్ట్రేటర్‌గానే కొనసాగుతానని వెల్లడించారు. తాను ఏ పదవిలో ఉన్న క్రికెట్ అభివృద్ధికే కృషి చేస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ బోర్డు (క్యాబ్)లో దాల్మియా వ్యతిరేక వర్గం కంటే అనుకూలవర్గమే బలంగా ఉంది.
ఈ కారణ వల్ల గంగూలీ పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది గంగూలీ ఖచ్చితంగా పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు.