వింబుల్డన్ ఓపెన్: సానియా శుభారంభం

FileFILE
వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా శుభారంభం చేసింది. ప్రారంభ రౌండులో జర్మనీకి చెందిన అనా గ్రోన్‌ఫెల్డ్‌పై 6-2, 2-6, 6-2తో సానియా గెలుపొంది రెండో రౌండులో బెర్త్ ఖరారు చేసుకుంది.

రెండో రౌండులో రొమేనియాకు చెందిన ఎదీనా గాలోవిట్స్ మరియు సొరానా కిర్‌స్టర్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో సానియా తలపడనుంది. ఈ విజయంతో 78వ ర్యాంకర్ అయిన సానియా 3-0తో 51వ ర్యాంకర్ ఫెల్డ్‌పై ఆధిపత్యం వహించింది.

తొలి రౌండు మ్యాచ్.. తొలి సెట్‌లో అద్భుతంగా రాణించిన సానియాకు రెండో సెట్లో మాత్రం ఫెల్డ్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే అప్పటికే మూడు బ్రేక్ పాయింట్లు సానియా సాధించి ఉండటంతో చివరి సెట్లో ప్రత్యర్థిపై అధిపత్యంతో గెలుపొందింది.

తనకైనా మెరుగైన ర్యాంకర్ అయినప్పటికీ ఫెల్డ్‌పై సానియా ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కటి ప్రదర్శన కనబరచగలిగింది.

వెబ్దునియా పై చదవండి